Samantha: జ్వరంతో స్వల్ప అస్వస్థతకు గురైన సమంత

Samantha suffers with fever
  • విడుదలకు ముస్తాబవుతున్న శాకుంతలం
  • వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలతో సమంత బిజీ
  • జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నానని వెల్లడి
ప్రముఖ నటి సమంత కొంతకాలం కిందట మయోసైటిస్ రుగ్మతకు గురయ్యారు. ఆ తర్వాత చాలా రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న సమంత క్రమంగా కోలుకున్నారు. అయితే, ఇటీవల మళ్లీ సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఆమె నటించిన శాకుంతలం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సమంత బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో, సమంత అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

ఇవాళ ఎంఎల్ఆర్ఐటీలో జరగాల్సిన శాకుంతలం ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొనడంలేదని తెలిపారు. వరుసగా ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొనడం వల్ల అనారోగ్యానికి గురయ్యానని వివరించారు. శాకుంతలం టీమ్ తో కలిసి అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందరినీ మిస్సవుతున్నానని సమంత విచారం వ్యక్తం చేశారు.
Samantha
Fever
Sakuntalam
Tollywood

More Telugu News