MS Dhoni: ఐపీఎల్ లో చెన్నై కెప్టెన్ గా 200వ మ్యాచ్ ఆడుతున్న ధోనీ

  • ధోనీ కెరీర్ లో మరో మైలురాయి
  • పసుపువర్ణంలోకి మారిన చెపాక్ స్టేడియం
  • రాజస్థాన్ పై టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్
  • బౌలింగ్ ఎంచుకున్న ధోనీ
Dhoni plays his 200th IPL match

భారత్ క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో అరుదైన ఘనత అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా నేడు తన 200వ మ్యాచ్ ఆడుతున్నాడు. ఐపీఎల్ 2008లో ప్రారంభం కాగా, అప్పటి నుంచి ధోనీ సారథ్యంలోనే చెన్నై ప్రస్థానం కొనసాగింది. గత సీజన్ లో మాత్రం జడేజా కొన్ని మ్యాచ్ లకు కెప్టెన్సీ వహించాడు. 

2016లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐపీఎల్ నుంచి సస్పెండ్ చేయగా, ఆ సీజన్ లో ధోనీ పూణే సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా వ్యవహరించాడు. సస్పెన్షన్ ముగిసిన తర్వాత చెన్నై జట్టు మళ్లీ ఐపీఎల్ లో అడుగుపెట్టగా, ధోనీకే పగ్గాలు అప్పగించారు. ఇవాళ తన 200వ మ్యాచ్ ను సూపర్ కింగ్స్ సొంతగడ్డ చెపాక్ స్టేడియంలో ఆడుతుండడం విశేషం. 

ఐపీఎల్ లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 6 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 30, జోస్ బట్లర్ 17 పరుగులతో ఆడుతున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 10 పరుగులు చేసి అవుటయ్యాడు.

More Telugu News