Delhi Capitals: వార్నర్, అక్షర్ పటేల్ ఫిఫ్టీలు... ఢిల్లీ భారీ స్కోరు

DC set 173 runs target to MI
  • ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
  • 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఢిల్లీ ఆలౌట్
  • బెహ్రెండార్ఫ్, పియూష్ చావ్లాలకు చెరో 3 వికెట్లు
ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (51), ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (54) అర్ధసెంచరీలతో రాణించారు. మనీశ్ పాండే 26, పృథ్వీ షా 15 పరుగులు చేశారు. 

యశ్ ధూల్ (2), రోవ్ మాన్ పావెల్ (4), లలిత్ యాదవ్ (2), వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ (1), కుల్దీప్ యాదవ్ (0) విఫలమయ్యారు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో బెహ్రెండార్ఫ్ 3, పియూష్ చావ్లా 3, రిలే మెరిడిత్ 2, హృతిక్ షోకీన్ 1 వికెట్ తీశారు. 

అనంతరం, లక్ష్యఛేదనను ముంబయి ఇండియన్స్ ధాటిగా ప్రారంభించింది. 3 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 24, ఇషాన్ కిషన్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Delhi Capitals
Mumbai Indians
IPL

More Telugu News