Goopichand: ఖుష్బూ గురించి ఒకమాట కచ్చితంగా చెప్పుకోవాలి: డైరెక్టర్ శ్రీవాస్

Sriwass Interview
  • గోపీచంద్ తో 'రామబాణం' చేస్తున్న శ్రీవాస్
  • అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగే కథ  
  • ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న ఖుష్బూ 
  • ఎమోషన్స్ బలంగా ఉంటాయని చెప్పిన శ్రీవాస్

ఒకప్పుడు గ్లామరస్ బ్యూటీగా ఒక వెలుగు వెలిగిన ఖుష్బూ, ఇప్పుడు కేరక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళంతో పాటు తెలుగులోను తనస్థాయికి తగిన పాత్రలను చేస్తూ వెళుతున్నారు. తాజాగా శ్రీవాస్ .. గోపీచంద్ కాంబినేషన్లోని సినిమాలోను ఆమె ఒక ముఖ్యమైన పాత్రను చేశారు. 

తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీవాస్ మాట్లాడుతూ .. "నా సినిమాల్లో  ఖుష్బూ గారు పనిచేయడం ఇదే ఫస్టు టైమ్. ఆమె చాలా సీనియర్ ఆర్టిస్ట్. ఆమె వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో .. ఏమోనని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఆమె 'కారవాన్' ఒకసారి దిగారంటే, స్పాట్ లోనే ఉంటారు. రెడీ కావడానికి ఎక్కువ సమయం తీసుకోరు. ఆమె అంకితభావం చూసి నేను షాక్ అయ్యాను" అన్నారు. 

జగపతిబాబుగారు 'అంతఃపురం' సినిమా చేస్తున్నప్పటి నుంచి ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. అలాగే గోపీచంద్ కి 'లక్ష్యం' .. 'లౌక్యం'తో రెండు హిట్లు ఇచ్చాను. అలాంటి ఈ ఇద్దరితో కలిసి మరోసారి వర్క్ చేస్తుండటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ సినిమాలోని ఎమోషన్స్ కి ఆడియన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతారు" అంటూ చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News