YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో కొత్త కోణం!

Telangana high court takes up YS Bhaskar Reddy petition in Viveka case
  • వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్
  • దస్తగిరిని అప్రూవర్ గా అనుమతించవద్దన్న భాస్కర్ రెడ్డి
  • విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు
  • తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. దస్తగిరిని అప్రూవర్ గా అనుమతించవద్దని భాస్కర్ రెడ్డి కోర్టును కోరారు. వాదనల సందర్భంగా వివేకా హత్య కేసులో కొత్త కోణం వెల్లడైంది. సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగికంగా వేధించారని, తల్లిని లైంగికంగా వేధించడం వల్లే వివేకాను సునీల్ యాదవ్ హత్య చేశారని భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న పిమ్మట తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.
YS Vivekananda Reddy
Bhaskar Reddy
Petition
Telangana High Court
Andhra Pradesh

More Telugu News