Vellampalli Srinivasa Rao: సీపీఐ రామకృష్ణ డబ్బులకు అమ్ముడుపోయిన వ్యక్తి: వెల్లంపల్లి శ్రీనివాస్

Vellampalli Srinivasa Rao fires on CPI Ramakrishna
  • రామకృష్ణ టీడీపీకి అమ్ముడుపోయారన్న వెల్లంపల్లి
  • డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తుల వల్ల సీపీఐకి ఈరోజు ఈ గతి పట్టిందని విమర్శ
  • జగన్ ను ఆడిపోసుకుంటే ఊరుకోబోమని హెచ్చరిక
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అమ్ముడు పోయిన వ్యక్తి అని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. టీడీపీకి రామకృష్ణ అమ్ముడుపోయారని అన్నారు. డబ్బుల కోసం అమ్ముడుపోయే నేతల వల్లే సీపీఐకి ఈరోజు ఈ గతి పట్టిందని అన్నారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు అన్నారని... మైనార్టీలపై దేశద్రోహం కేసు పెట్టిన ఘనత చంద్రబాబుదని దుయ్యబట్టారు. ఎస్సీలు, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత జగన్ దని అన్నారు. తమ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ను ఆడిపోసుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చంద్రబాబు, సీపీఐ రామకృష్ణ వంటి దుష్టులు ఈ రాష్ట్రానికి అవసరం లేదని అన్నారు.
Vellampalli Srinivasa Rao
Jagan
YSRCP
CPI Ramakrishna

More Telugu News