Sai Tej: అప్పుడు అంతగా టెన్షన్ పెట్టిన తేజు ఇప్పుడు చింపేశాడు: అల్లు అరవింద్

Virupaksha Trailer Launch Event
  • అల్లు అరవింద్ చేతుల మీదుగా 'విరూపాక్ష' ట్రైలర్ రిలీజ్ 
  • సాయితేజ్ మరో మలుపు తీసుకున్నాడన్న అరవింద్ 
  • తను చింపేశాడని అంటూ ఉంటే సంతోషంగా ఉందని వెల్లడి 
  • తప్పకుండా హిట్ అవుతుందని ధీమా  

సాయితేజ్ హీరోగా చేసిన 'విరూపాక్ష' సినిమా, ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంటులో అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "తేజు ఫోన్ చేసి ట్రైలర్ లాంచ్ నేను చేయాలని అడిగాడు. తన నుంచి కాల్ వచ్చినప్పుడు, మంచి కథ ఏదైనా దొరికిందేమో, నా బ్యానర్లో చేస్తానని చెప్పడానికి చేశాడేమోనని అనుకున్నాను" అన్నారు నవ్వుతూ.

"తేజు పుట్టిన దగ్గర నుంచి చూస్తూ వచ్చినవాడిని. తనకి ఆ రోజున ఆ ప్రమాదం జరిగినప్పుడు ముందుగా అక్కడికి చేరుకున్నది నేనే. అతనికి కొన్ని టెస్టులు చేసి బ్రతుకుతాడు .. బయటపడతాడు .. షాక్ లో ఉన్నాడు అనే విషయాన్ని డాక్టర్లు చెప్పడానికి ఒక 15 నిమిషాలు పట్టింది. ఈ 15 నిమిషాల్లో మేము పడిన టెన్షన్ ఆ భగవంతుడికే తెలియాలి" అని చెప్పారు. 

 "ఆ రోజున అంతగా టెన్షన్ పెట్టిన తను, మళ్లీ అక్కడి నుంచి ఒక మలుపు తీసుకుని, ఈ రోజున ఈ సినిమాను చింపేశాడని అంతా అంటూ ఉంటే ఆనందంగా ఉంది. ఈ సినిమాకి పిచ్చి ఓపెనింగ్స్ వస్తాయనే విషయం ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతోంది. 'కాంతార' సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసిన అజనీశ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించడం విశేషం. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News