ఏపీ రాజధాని అమరావతిని గుర్తించిన ఎయిర్ ఇండియా

Air India recognises Amaravati
  • అమరావతిని అధికారికంగా గుర్తించిన ఎయిర్ ఇండియా
  • ఢిల్లీకి వెళ్లే ఫ్లైట్ లో అమరావతి టు ఢిల్లీ అని పేర్కొంటున్న ఎయిర్ ఇండియా
  • టికెట్ స్టేటస్ లో కూడా అమరావతి అని వస్తున్న వైనం
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా అమరావతిని అధికారికంగా గుర్తించింది. నిన్నటి వరకు విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్లే విమాన సర్వీసులను గన్నవరం టు ఢిల్లీ అని ఎయిర్ ఇండియా పేర్కొనేది. ఇప్పుడు తన వెబ్ సైట్ లో కూడా అమరావతి టు ఢిల్లీ అని పేర్కొంటోంది. టికెట్ స్టేటస్ లో కూడా అమరావతే అని వస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అమరావతి ప్రాంత ప్రజలు, అమరావతి రాజధానికి మద్దతు పలుకుతున్న వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Air India
Amaravati
Gannavaram

More Telugu News