SRH: తనను బిగ్‌స్క్రీన్‌పై చూపించిన కెమెరామ్యాన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ ఆగ్రహం.. వీడియో ఇదిగో!

Kaviya Maran Loses Cool At Cameraman Even As Sunrisers Hyderabad Post 1st Win
  • పంజాబ్‌పై గెలిచి బోణీ కొట్టిన హైదరాబాద్
  • స్టాండ్స్‌లో  సందడి చేసిన కావ్యా మారన్
  • కావ్యా పాప నవ్విందంటూ నెటిజన్ల కామెంట్లు
పంజాబ్ కింగ్స్‌తో గత రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మొత్తానికి బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైన జట్టు పంజాబ్‌పై అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించింది. కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ కెమెరామ్యాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

హైదరాబాద్ మ్యాచ్‌లకు తరచూ హాజరై స్టాండ్స్‌లో సందడి చేసే కావ్యా మారన్ ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ కనిపిస్తారు. నిన్నటి మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించడంతో ఆమె ఆనందానికి హద్దే లేకుండా పోయింది. స్టాండ్స్‌లో నవ్వుతూ కనిపించిన ఆమె ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి అభిమానులు ‘కావ్యా పాప నవ్విందోచ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

అంత వరకు బాగానే ఉన్నా.. తనను బిగ్‌స్క్రీన్‌పై చూపించడంపై అసహనం వ్యక్తం చేసిన కావ్య.. కెమెరామ్యాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హట్ రే’ అని మండిపడ్డారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
SRH
PBKS
Kaviya Maran
Hyderabad
IPL 2023

More Telugu News