Nara Lokesh: లోకేశ్ ను కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్న ఎస్సీలు... విన్నావా జగన్ రెడ్డీ అంటూ లోకేశ్ కామెంట్స్

  • అనంతపురం జిల్లాలో లోకేశ్ యువగళం
  • శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర
  • ఇన్నోవాలు పొందిన ఎస్సీలు లోకేశ్ తో భేటీ
  • టీడీపీకి రుణపడి ఉంటామన్న ఇన్నోవా లబ్దిదారులు 
Innova beneficiaries met Nara Lokesh in Singanamala constituency

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర శింగనమల అసెంబ్లీ నియోజకవర్గంలో విజయవంతంగా ముందుకు సాగుతోంది. శింగనమల నియోజకవర్గం జంబులదిన్నె క్యాంప్ సైట్ నుంచి 65వ రోజు పాదయాత్ర ఆదివారం ఉదయం ప్రారంభమైంది. క్యాంప్ సైట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ తో యువనేత ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. దారిపొడవునా లోకేశ్ కు వివిధ వర్గాల నుంచి వినతులు వెల్లువెత్తాయి. కురుబలు, వాల్మీకి బోయలు, విశ్వబ్రాహ్మణులు, మత్స్యకారులు, ప్రైవేటు డాక్టర్లు యువనేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. 

రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరికీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చి లోకేశ్ ముందుకు సాగారు. జంబులదిన్నె సమీపంలో పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న రైతు దంపతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. వెస్ట్ నర్సాపురం బెండ, వేరుశనగ రైతులను కలిసి వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. 

లోకేశ్ పలకరింపుతో పులకరించిన దళిత రైతు కుటుంబం

గాజులదిన్నె సమీపంలో లోకేశ్ కు ఓ పొలంలో వన్నూరప్ప, నారాయణమ్మ దంపతులు పనిచేస్తూ కనిపించారు. లోకేశ్ వారి వద్దకు వెళ్లి వారు పండిస్తున్న పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు పండిస్తున్న పంటలు, పెట్టుబడి, డ్రిప్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినవెంటనే రైతులను ఆదుకుంటామని తెలిపారు. 

"100 శాతం సబ్సిడీపై ఎస్సీ రైతులకు డ్రిప్ అందిస్తాం. గతంలో రైతులకు అందించిన సంక్షేమ పథకాలు అందిస్తాం. చీనీ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి ధరలు పెంచి, లాభాలు వచ్చేలా చేస్తాం. పెట్టుబడి ఖర్చులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటి చేస్తాం" అని భరోసా ఇచ్చారు. కాగా, లోకేశ్ తమ పొలంలో అడుగుపెట్టి, తమతో మాట్లాడడం పట్ల ఆ దంపతుల ఆనందం అంతాఇంతా కాదు.

జ‌గ‌న్ విన్నావా... ఎస్సీల ఇన్నోవా విజ‌య‌గాథ‌!

యువ‌గ‌ళం పాద‌యాత్ర శింగనమల నియోజకవర్గం సోడనపల్లి క్రాస్ వ‌ద్దకు చేరింది. ఈ సంద‌ర్భంగా దాదాపు ప‌దిమంది ఎస్సీ ల‌బ్ధిదారులు తాము పొందిన ఇన్నోవా కార్లతో వ‌చ్చి లోకేశ్ ని క‌లిశారు. డ్రైవ‌ర్లుగా ప‌నిచేస్తూ జీవ‌నం సాగిస్తోన్న త‌మ‌కు టీడీపీ ప్రభుత్వం అందించిన ఇన్నోవాలు య‌జ‌మానులుగా మార్చి గౌర‌వ‌ప్రద‌మైన జీవితానికి మార్గం చూపాయ‌ని సంతోషం వ్యక్తం చేశారు. నాటి సీఎం చంద్రబాబు దూర‌దృష్టితో, ఎస్సీ కార్పొరేష‌న్ ద్వారా చేసిన సాయంతో సొంత‌కాళ్లపై నిల‌బ‌డిన ఎస్సీలు లోకేశ్ కు కృత‌జ్ఞత‌లు తెలిపారు. 

ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ, ఎస్సీ సోద‌రుల ఇన్నోవా విజ‌య‌గాథ ఇది అని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హ‌యాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లని నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న ఎస్సీల‌ స్వయం ఉపాధి స‌క్సెస్ స్టోరీ ఇది అని తెలిపారు. 

"ద‌ళిత డ్రైవ‌ర్‌ని చంపి ఇన్నోవాలో డోర్ డెలివ‌రీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీకి స‌న్మానం చేసిన వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డీ నేను విన్నానంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. టీడీపీ ఎస్సీల‌కు ఇచ్చిన ఇన్నోవా ప‌థ‌కం విజ‌య‌గాథ విన్నావా జ‌గ‌న్ రెడ్డీ" అంటూ లోకేశ్ వారితో సెల్ఫీ దిగారు.

లోకేష్ అన్న మ‌న‌సు... ఓ తెలుగు త‌మ్ముడి భ‌విత‌కై త‌ప‌న‌

యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేశ్ లోని మానవీయ కోణం వెల్లడైంది. త‌న యువ‌గ‌ళం పాద‌యాత్రలో పాల్గొంటూ వ‌స్తున్న యువ‌కుడు చ‌దువుకి దూరం కాకూడ‌ద‌నే త‌ప‌న‌తో "నా త‌మ్ముడివి క‌దూ.... అని అనున‌యించి, బుజ్జగించి కాలేజీకి పంపిన నారా లోకేశ్ అన్నయ్య మ‌న‌సు చాటుకున్నారు. ఆ అబ్బాయి పేరు ‍ఆకుల విష్ణు వికాస్. ఊరు పెనుగొండ టౌన్‌. పెనుకొండ నియోజవర్గ కేంద్రం రామభద్రాలయం, తోటగిరి వీధిలో బ‌లిజ సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఆకుల నరసింహులు ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని. ఆయ‌న భార్య పేరు నిర్మ‌ల‌. వీరి అబ్బాయే ఆకుల విష్ణువికాస్‌. 

ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచీ న‌ర‌సింహులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అంటే సొంత కుటుంబం లెక్క‌. తెలుగుదేశం పార్టీ కోసం ప‌నిచేస్తూనే ఉంటుంది న‌ర‌సింహులు కుటుంబం. త‌మ కొడుకు ఆకుల విష్ణు వికాస్ ఇంట‌ర్‌(ఎంపీసీ) సెకండియ‌ర్ ప‌రీక్షలు రాసిన అనంత‌రం లోకేశ్ అన్న వెంట తానూ న‌డుస్తాన‌ని త‌ల్లిదండ్రుల‌కి చెప్పాడు. తెలుగుదేశం పార్టీ అంటే వ‌ల్లమాలిన అభిమానం ఉన్న ఆ త‌ల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకుని యువ‌గ‌ళం పాద‌యాత్రకి తీసుకొచ్చారు. అప్పటి నుంచీ తానూ వ‌లంటీరుగా పాద‌యాత్ర బృందంలో చేరిపోయాడు. 

విష్ణువికాస్ ఇంకా మీ జిల్లా పాద‌యాత్ర అయిపోతుంది, ఇంటికి వెళ్లవ‌చ్చని పెద్దలు చెబితే, "నేను వెళ్లను.... లోకేశ్ అన్న వెంటే న‌డుస్తాను, జీవితాంతం ఆయ‌న వెంటే ఉంటాను" అంటూ మారాం ప్రారంభించాడు. ఈ విష‌యం తెలుసుకున్న లోకేశ్...  విష్ణువికాస్ ని పిలిపించుకున్నాడు. 

"త‌మ్ముడూ నేనంటే నీకెంత అభిమాన‌మో నాకు తెలుసు. ఒక అన్నగా చెబుతున్నా నా మాట విను. నాపై అభిమానంతో యువ‌గ‌ళంలో ఉండి చ‌దువు దూరం చేసుకోకు. అమ్మానాన్నలు చెప్పిన‌ట్టు విను. చ‌దువులు కొన‌సాగించు. నీకు ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా ఈ అన్నయ్య అండ‌గా ఉంటాడు. న‌న్ను చూడాల‌నుకుంటే వారానికోసారి రా" అంటూ న‌చ్చ‌జెప్ప‌డంతో విష్ణువికాస్ అయిష్టంగానే ఒప్పుకున్నాడు. "చ‌దువు పూర్తయ్యాక తెలుగుదేశం కోసం మ‌నం క‌లిసి ప‌నిచేద్దాం" అనే మాట విష్ణువికాస్‌ ను ఆకట్టుకుంది. 

నారా లోకేశ్ ను కలిసిన ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు

జంబులదిన్నె క్యాంప్ సైట్ లో ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు లోకేశ్ ను కలిసి సమస్యలను విన్నవించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి గతంలో మాదిరిగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును కొనసాగించాలని తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు కార్పొరేట్ ఆసుపత్రులకు మాత్రమే పరిమితమయ్యాయని. వాటిని 20-30 బెడ్ల ఆసుపత్రులకు కూడా వర్తింపజేయాలని కోరారు. 

ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, దంత వైద్యశాలలకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. వైద్యులు, ఆసుపత్రులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... జగన్మోహన్ రెడ్డి పాలనలో వైద్య, ఆరోగ్యరంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో కనీసం దూది, గాజుగుడ్డ దొరకని దుస్థితి నెలకొందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా కరోనా సమయంలో వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిశాయని తెలిపారు. 

టీడీపీ అధికారంలోకి వచ్చాక వైద్య రంగాన్ని బలోపేతం చేస్తామని. మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీని విస్తరింపజేసి మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని, హెల్త్ యూనివర్శిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మారుస్తామని స్పష్టం చేశారు..


*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 830.1 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 14.4 కి.మీ.*

*66వరోజు (10-4-2023) యువగళం వివరాలు:*

*శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం*

ఉదయం

8.00 – సోడనంపల్లి క్రాస్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.00 – పెద్దమట్లగొందిలో యాదవ సామాజికవర్గీయులతో భేటీ.

10.20 – చిన్నమట్లగొందిలో స్థానికులతో మాటామంతీ.

11.10 – సలకం చెరువులో గాండ్ల సామాజికవర్గీయులతో సమావేశం.

11.15 – వెస్ట్ నర్సాపురంలో కురుబ సామాజికవర్గీయులతో భేటీ.

11.50 – సలకంచెరువులో ఎస్సీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.

మధ్యాహ్నం

12.50 – సలకంచెరువు శివార్లలో భోజన విరామం.

2.00 – సలకంచెరువు శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.

సాయంత్రం

3.00 – కొరివిపల్లిలో స్థానికులతో సమావేశం.

4.10 – ఉల్లికల్లులో స్థానికులతో సమావేశం.

5.50 – ఉల్లికుంటపల్లి విడిది కేంద్రంలో బస.


More Telugu News