Asaduddin Owaisi: మేం లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తే ఊరుకుంటారా?: ఒవైసీ

Owaisi says Godse photo was displayed in Sri Rama Navami Shobha Yaytra
  • ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాదులో శోభాయాత్ర
  • గాడ్సే ఫొటోలతో డ్యాన్సులు చేశారన్న ఒవైసీ
  • పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఆగ్రహం
ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన శోభాయాత్రలో నాథూరామ్ గాడ్సే ఫొటోలు ప్రదర్శించారని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. గాడ్సే ఫొటోలు ప్రదర్శించినవారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గాంధీ హంతకుల ఫొటోలతో డ్యాన్సులు చేసింది ఎవరు? గాడ్సే ఫొటోలు ప్రదర్శిస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారని నిలదీశారు. 

అదే, తాము లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తే ఊరుకునేవారా? అంటూ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము లాడెన్ ఫొటోలు ప్రదర్శించి ఉంటే... ఎంఐఎం కారణంగా హైదరాబాదు టెర్రరిస్టుల అడ్డాగా మారిందన్న వ్యాఖ్యలు వినిపించేవని, పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టేవారని అన్నారు.
Asaduddin Owaisi
Godse
Shobha Yatra
Sri Rama Navami
MIM
Hyderabad
Telangana

More Telugu News