chronic illnesses: కరోనా తర్వాత పెరిగిపోయిన దీర్ఘకాలిక వ్యాధులు

  • గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ
  • సీవోపీడీ, ఆస్తమా తదితర శ్వాసకోస సమస్యలు
  • రక్తపోటు బాధితుల్లోనూ పెరుగుదల
  • మానసిక ఆరోగ్యంలో మార్పులు
chronic illnesses that are becoming common in post Covid 19 world

కరోనా కేవలం ఊపిరితిత్తులపైనే కాదు, మూత్రపిండాలు, గుండె, మెదడు, కాలేయం ఇలా ఎన్నో అవయవాలపై ప్రభావం చూపించింది. కరోనా తర్వాత హార్ట్ ఎటాక్ కేసులు పెరిగిపోవడం కనిపిస్తూనే ఉంది. కరోనా తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరిగినట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో ప్రతీ నాలుగు మరణాల్లో ఒకటి గుండె సంబంధిత సమస్యల వల్లే ఉంటోంది. కరోనా వచ్చిన తర్వాత కనిపిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులను చూసినట్టయితే..

మానసిక పరిస్థితులలో మార్పులు
ఆందోళన, దిగులు, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలతో కరోనా తర్వాత చాలా మంది బాధపడుతున్నారు. కొందరిలో ఆరోగ్యం కరోనా ముందున్నట్టుగా లేదు. తమకు ఆప్తులైన, అత్యంత సన్నిహితులైన వారిని కోల్పోవడం కూడా ఒక కారణంగా వైద్యులు పేర్కొంటున్నారు. అలాగే, కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు కూడా మానసికపరమైన మార్పులకు కారణమని చెబుతున్నారు.

కేన్సర్
పాతోఫిజియాలజీలో ప్రొటీన్లను కరోనా లక్ష్యంగా చేసుకుంది. దీంతో కేన్సర్ కేసులు పెరిగినట్టు నిపుణులు చెబుతున్నారు. కరోనా పీ53, వాటికి సంబంధించి పాత్ వేలతో కలిసి డీఎన్ఏ, సెల్ ఆక్సిడేటివ్ నష్టానికి ఎలా కారణమైందన్న దానిపై ఓ అధ్యయనం కూడా జరిగింది. 

శ్వాసకోస సమస్యలు
కరోనా తర్వాత దీర్ఘకాలిక దగ్గు సమస్య కూడా కొందరిని వేధిస్తోంది. శ్వాస తీసుకోవడంలో సమస్యలు, ఛాతీలో అసౌకర్యానికి తోడు.. ఆస్తమా, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లు పెరుగుతున్నట్టు నిపుణులు తెలియజేస్తున్నారు.

బీపీ
రక్తపోటు (హైపర్ టెన్షన్) కేసులు కూడా కరోనా తర్వాత పెరిగాయి. ఇది శరీరంలో జరిగిన మార్పుల వల్లా లేక పెరిగిన అవగాహన వల్లా అనేది స్పష్టత లేదు. కరోనా తర్వాత భిన్న వయసు గ్రూపుల వారిలో రక్తపోటు బాధితుల సంఖ్య పెరిగినట్టు జర్నల్ సర్క్యులేషన్ అనే పత్రికలో ప్రచురితమైన అధ్యయన ఫలితాలు తెలియజేస్తున్నాయి.

గుండె జబ్బులు
కరోనా తర్వాత వెలుగు చూస్తున్న ఎక్కువ కేసుల్లో గుండె జబ్బులు ప్రధానమైనవి. గుండె స్పందన వ్యవస్థపై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బ్లడ్ క్లాట్, గుండె వైఫల్యాలు, హార్ట్ ఎటాక్ కేసులు పెరిగాయి. 

ఆస్తమా
వైరస్ లేదా ఇతర ఫారీన్ బాడీతో రోగ నిరోధక వ్యవస్థ పోరాటం చేయడం వల్ల ఇన్ ఫ్లమ్మేషన్ ఏర్పడుతుంది. శ్వాసకోస వ్యవస్థ వాయు మార్గాల్లోని కండరాలు కుచించుకుపోతాయి. దీనివల్ల మరింత మ్యూకస్ (కళ్లె) ఏర్పడుతుంది. దీంతో దగ్గు, ఛాతీలో నొప్పి, ఆస్తమా సమస్యలు కనిపిస్తాయి.

సీవోపీడీ
కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులను లక్ష్యంగా చేసుకోవడం వల్ల దీర్ఘకాల శ్వాసకోస సమస్యలతో చాలా మంది బాధపడుతూనే ఉన్నారు. సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే అప్పటికే సీవోపీడీ సమస్యలు ఉన్నవారిపై కరోనా వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కరోనా పోయిన తర్వాత కూడా ఇప్పటికీ వాటి తాలూకూ దుష్ప్రభావాలను ఎదుర్కొంటూనే ఉన్నారు.

More Telugu News