Sukesh chndrasekhar: భూమిపై నీ అంత అందంగా మరెవరూ లేరు.. జాక్వెలిన్ కు సుకేశ్ లేఖ

My Baby my Bomma Conman Sukeshs Easter wish for Jacqueline from Tihar Jail
  • జైలులో ఉన్నా జాక్వెలిన్ ను మరవని సుకేశ్ చంద్రశేఖర్
  • ఈస్టర్ పండుగ సందర్భంగా లేఖ ద్వారా శుభాకాంక్షలు
  • తనను పిచ్చిగా ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పిన నిందితుడు
రూ.200 కోట్లకు పైగా మనీలాండరింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్, తన ప్రియురాలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను మరిచిపోలేకపోతున్నాడు. వీలైన ప్రతీ సందర్భంలోనూ అతడు ఆమెకు జైలు నుంచే శుభాకాంక్షలు పంపిస్తున్నాడు. తాజాగా ఈస్టర్ శుభాకాంక్షలను జాక్వెలిన్ కు తెలియజేశాడు. ప్రస్తుతం అతడు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు. జైలు నుంచే జాక్వెలిన్ కు ఓ లేఖ రాశాడు.

లక్స్ కోజీ యాడ్ ను చూస్తూ ఆమె గురించే ఆలోచిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నాడు. ‘‘నా బేబీ నా బొమ్మ, జాక్వెలిన్. నీకు హ్యాపీ ఈస్టర్ శుభాకాంక్షలు. సంవత్సరం మొత్తం మీద నీకు ఇష్టమైన పండుగల్లో ఇది కూడా ఒకటి. నా బేబీ నీవు ఎంత అందంగా ఉంటావో తెలుసా? భూమిపై నీ అంత అందంగా మరెవరూ లేరు. నా బన్నీ ర్యాబిట్. నా బేబీని ఎంతో ప్రేమిస్తున్నాను. ప్రస్తుత దశ మంచిగా ముగుస్తుందని ఆశిస్తున్నాను. వచ్చే ఈస్టర్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఉత్తమంగా ఉంటుంది’’అని లేఖ రాశాడు. తనను పిచ్చిగా ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతూ, చివర్లో జాక్వెలిన్ తల్లిదండ్రులకు సైతం శుభాకాంక్షలు తెలియజేశాడు. 

సన్ టీవీ యజమానిననీ, దివంగత నేత జయలలిత బంధువునని చెప్పి పరిచయం చేసుకున్న సుకేశ్ చంద్రశేఖర్ తన జీవితాన్ని నరకప్రాయంగా మార్చేశాడని లోగడ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఆరోపించడం తెలిసే ఉంటుంది. తన కెరీర్ ను నాశనం చేసి, జీవనాధారాన్ని పోగొట్టాడని మనీలాండరింగ్ కేసులో భాగంగా పటియాలా కోర్టులో కు వాంగ్మూలం కూడా ఇచ్చారు. సౌత్ ఇండియా సినిమాల్లో కలిసి పనిచేద్దామంటూ సుకేశ్ తనను తప్పుదోవ పట్టించాడని జాక్వెలిన్ కోర్టుకు తెలిపారు.
Sukesh chndrasekhar
Jacqueline fernandez
Easter wishes
Tihar Jail

More Telugu News