Mangoes on EMI: మామిడిపండ్లను ఈఎంఐ పద్ధతిలో అమ్ముతున్న పుణె వ్యాపారి

  • ముందు తినండి.. తర్వాతే డబ్బులివ్వండి అంటున్న గౌరవ్ సనాస్
  • మ్యాంగో లవర్స్ కోసమే ఈ ఆఫర్ తెచ్చినట్లు వెల్లడి
  • రూ.5 వేలు అంతకంటే ఎక్కువ మొత్తం కొంటేనే ఈఎంఐ సదుపాయం
Pune businessman sells Mangoes on EMI

మామిడిపండ్ల సీజన్ మొదలైంది.. నోరూరించే రకరకాల మామిడిపండ్లు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడం, దానికి తగ్గట్లుగా సప్లై లేకపోవడంతో ధరలు విపరీతంగా ఉన్నాయి. అందులోనూ అల్ఫాన్సా రకం పండ్ల రేటు మరీ ఎక్కువ. ఈ రేట్లను చూసి కొనడానికి వెనకాముందాడే మామిడిపండ్ల ప్రియుల కోసం మహారాష్ట్రలోని ఓ వ్యాపారి సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చాడు. ముందు తినండి.. ఆ తర్వాతే డబ్బులివ్వండంటూ ఈఎంఐ పద్ధతిలో పండ్లు అమ్ముతున్నారు. తమ దుకాణంలో రూ.5 వేలకు పైగా విలువైన పండ్లు కొంటే క్రెడిట్ కార్డుతో ఈఎంఐ పద్ధతిలో చెల్లించవచ్చని అంటున్నారు.

పుణెలోని గురుకృప ట్రేడర్స్ అండ్ ఫ్రూట్ ప్రొడక్ట్స్ దుకాణం యజమాని గౌరవ్ సనాస్ ఈ ఆఫర్ ను ప్రకటించారు. మామిడిపండ్లను అమితంగా ఇష్టపడే వారికోసం ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆల్ఫాన్సా రకం మామిడిపండ్ల ఖరీదు చాలా ఎక్కువని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ మామిడిపండ్ల ఖరీదు డజనుకు రూ.800 నుంచి రూ.1300 గా ఉందని తెలిపారు. పండ్లు తినాలనే కోరిక ఎంత ఉన్నప్పటికీ ఇంత మొత్తం ఒకేసారి చెల్లించలేని వారు ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేయొచ్చని గౌరవ్ చెప్పారు. ఇప్పటి వరకు ఈఎంఐ పద్ధతిలో ఐదుగురు కస్టమర్లు మామిడిపండ్లను కొనుగోలు చేశారని గౌరవ్ చెప్పారు.

More Telugu News