Karnataka: జయలలిత చరాస్తుల విక్రయానికి న్యాయవాదిని నియమించిన కర్ణాటక ప్రభుత్వం

Karnataka govt appoints SPP to dispose Jayalalithaas assets
  • 1996లో జయలలితపై అక్రమాస్తుల కేసు
  • సుప్రీంకోర్టు జోక్యంతో 2003లో తమిళనాడు నుంచి కర్ణాటకకు కేసు బదిలీ
  • జయ నివాసం నుంచి విస్తుగొలిపే బంగారు నగలు, వజ్రాభరణాలు, ఇతర వస్తువుల స్వాధీనం
  • కర్ణాటక ప్రభుత్వ అధీనంలోనే జయ చరాస్తులు
అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న చరాస్తులను విక్రయించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమాస్తులకు సంబంధించి 1996లో జయలలితపై కేసు నమోదైంది. సుప్రీంకోర్టు జోక్యంతో 2003లో ఈ కేసు తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయింది. సీబీఐ కేసుల్లో 2014లో ప్రత్యేక న్యాయస్థానం జయను దోషిగా తేల్చింది.

ఈ కేసు సందర్భంగా 11 డిసెంబరు 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి 7 కిలోల బంగారం/వజ్రాభరణాలు, 600 కేజీల వెండి ఆభరణాలు, 11 వేలకుపైగా చీరలు, 750 జతల పాదరక్షలు, 91 చేతి గడియారాలు, 131 సూట్‌కేసులు, 1,040 వీడియో క్యాసెట్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు, ఇతర విద్యుత్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి.

ఈ చరాస్తుల విక్రయానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌(ఎస్ఎస్‌పీ) అవసరమని పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు రిజస్ట్రార్‌కు అక్టోబరు 2022లో సీబీఐ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో న్యాయవాది కిరణ్ ఎస్ జావళిని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్‌పీపీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Karnataka
Jayalalitha
SPP
Jayalalitha Assets

More Telugu News