IMD: రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి: ఐఎండీ

  • ఇప్పటికే దేశంలో చాలా భాగాల్లో మండుతున్న ఎండలు  
  • గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 4 డిగ్రీల పెరుగుదల
  • పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
IMD weather update for five days

ఇప్పటికే దేశంలో చాలా భాగాల్లో ఎండలు మండిపోతున్నాయి. మరోపక్క, రానున్న ఐదు రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో  2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర పెంపు చోటుచేసుకోవచ్చని వివరించింది. 

మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో రానున్న రెండ్రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఆ తర్వాత క్రమేపీ వర్షాలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ పేర్కొంది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఈ నెల మొదట్లో ఐఎండీ వెల్లడించింది.

More Telugu News