Ukraine: భారత పర్యటనకు రానున్న ఉక్రెయిన్ మహిళా మంత్రి

  • భారత్ కు వస్తున్న విదేశాంగ డిప్యూటీ మంత్రి ఎమైన్ జాపరోవా
  • నాలుగు రోజులు భారత్ లో పర్యటించనున్న మంత్రి 
  • రష్యా దాడిని ప్రారంభించిన తర్వాత తొలిసారి భారత్ కు వస్తున్న ఉక్రెయిన్ ప్రతినిధులు
Ukraine women minister visiting India

రష్యా చేస్తున్న దండయాత్రతో ఉక్రెయిన్ కకావికలం అయిన సంగతి తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే ఆ దేశంలో శ్మశాన వాతావరణం నెలకొంది. మరోవైపు ఆ దేశానికి చెందిన విదేశాంగ డిప్యూటీ మంత్రి ఎమైన్ జాపరోవా భారత పర్యటనకు వస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఆమె భారత్ లో పర్యటించనున్నారు. 

రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ ప్రతినిధులు భారత్ కు అధికారిక పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ వరకు ఆమె ఇండియాలో పర్యటిస్తారని భారత విదేశాంగ శాఖ ఈరోజు అధికారిక ప్రకటన చేసింది. తన పర్యటనలో భాగంగా భారత విదేశాంగ శాఖ పశ్చిమ దేశాల కార్యదర్శి సంజయ్ వర్మతో జాపరోవా సమావేశమవుతారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఇరువురూ చర్చలు జరుపుతారు.

More Telugu News