Delhi Capitals: ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్... రాజస్థాన్ పై టాస్ నెగ్గిన ఢిల్లీ

Delhi Capitals won the toss against Rajasthan Royals
  • వీకెండ్ నేపథ్యంలో నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు
  • తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
  • ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిన ఢిల్లీ
  • నేటి మ్యాచ్ లో గెలుపుపై ఆశలు
వీకెండ్ కావడంతో నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. గువాహటి వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు తానాడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గి తీరాలన్న కసితో బరిలో దిగుతోంది. 

రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ గైర్హాజరీలో ఢిల్లీ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న డేవిడ్ వార్నర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. అటు కెప్టెన్సీ పరంగా, ఇటు ఆటగాడిగా విఫలమవుతున్నాడు. జట్టులోని కీలక ఆటగాళ్లు సైతం ఫామ్ లేక పోవడం ఢిల్లీ జట్టుకు ప్రతికూలంగా మారింది. 

నేడు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టులో పలు మార్పులు చేశారు. ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో రోవ్ మాన్ పావెల్ ను తీసుకున్నారు. సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో లలిత్ కు స్థానం కల్పించారు. మనీశ్ పాండే మళ్లీ జట్టులోకి వచ్చాడు.
Delhi Capitals
Rajasthan Royals
Toss
IPL

More Telugu News