kailash vijayvargiya: మహిళల వస్త్రధారణపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

BJPs Kailash Vijayvargiya Says Badly Dressed Girls Look Like Shurpanakha
  • ఆ దుస్తులలో శూర్పణఖలా ఉంటారన్న కైలాశ్ విజయ్ వర్గీయ
  • హనుమాన్ జయంతి వేడుకల కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు
  • దేవుడు ఇచ్చిన అందమైన శరీరానికి మంచి దుస్తులు తొడగాలని సూచన
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో 
మహిళల వస్త్రధారణపై బీజేపీ నేత కైలాశ్ విజయ్ వర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ జయంతి, మహవీర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కైలాశ్ వర్గీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది మహిళలు చెడ్డ దుస్తులు ధరించి శూర్పణఖలాగా కనిపిస్తుంటారని అన్నారు. రాత్రిపూట తాను కారులో వెళుతుంటే కొంతమంది యువతులు డ్రగ్స్ మత్తులో ఊగిపోతూ కనిపిస్తుంటారని చెప్పారు. వెంటనే కారు దిగి వారి మత్తు దిగిపోయేలా చెంపలు వాయించాలని అనిపిస్తుందని అన్నారు.

దేవుడు మనకు అందమైన శరీరాన్ని ఇచ్చాడని, మంచి వస్త్రధారణతో మరింత అందం సమకూరుతుందని కైలాశ్ విజయ్ వర్గీయ చెప్పారు. అందుకే మహిళలు మంచి దుస్తులు ధరించాలని ఆయన సూచించారు. కైలాశ్ విజయ్ వర్గీయ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో.. ‘మహిళల్లో దేవతలను చూసే సంస్కృతి మనది.. కానీ కొంతమంది అమ్మాయిలు చెడ్డ దుస్తులు ధరించి తిరుగుతుంటారు. వాళ్లలో దేవతలు కాదు శూర్పణఖ కనిపిస్తుంది. దేవుడు అందమైన శరీరాన్ని ఇచ్చాడు. మంచి దుస్తులు వేసుకోండి ఫ్రెండ్స్’ అని చెప్పారు.
kailash vijayvargiya
BJP
hanuman jayanthi
shurpanakha
women dressing

More Telugu News