Celina Jaitly: ముగ్గురు పిల్లల తల్లి సెలీనా జైట్లీకి పెళ్లి ఆఫర్.. తెలివిగా స్పందించిన నటి

Celina Jaitly gets marriage proposal from Twitter user actress gives a savage reply
  • తనకు ఆరోగ్యం బాగాలేదని, పెళ్లి చేసుకుని కాపాడాలంటూ ఓ అభిమాని అభ్యర్థన
  • తన భర్త, పిల్లలను అడిగి చెబుతానంటూ సెలీనా బదులు
  • ఆమె స్పందనను మెచ్చుకుంటున్న అభిమానులు
నటి సెలీనా జైట్లీకి ట్విట్టర్ లో ఊహించని ప్రతిపాదన వచ్చింది. హోటల్ వ్యాపారి పీటర్ హాంగ్ ను పెళ్లాడిన సెలీనాకి ముగ్గురు పిల్లలు సంతానంగా ఉన్నారు. ఈ వయసులో తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా ఆమెను వేడుకోవడం కనిపించింది. దీనికి సెలీనా కాస్త తెలివిగా, హాస్యం జోడించి బదులిచ్చారు.

‘‘మీకు శుభాకాంక్షలు. నా ఆరోగ్యం బాగోలేదు. నా బాగోగులు చూసుకునే వారు ఎవరూ లేరు. నా ఆరోగ్యం మరింత దిగజారి పోకముందే, నన్ను పెళ్లి చేసుకునేందుకు వెంటనే నన్ను మీ వెంట తీసుకెళ్లండి. ఇల్లరికానికి నేను సిద్ధమే. నా జీవితాన్ని, ఆరోగ్యాన్ని కాపాడండి. దయచేసి నా ట్వీట్ కి రిప్లయ్ ఇవ్వండి’’ అంటూ కోల్ కతాకు చెందిన విజయ్ మంగన్ లాల్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. దీనికి సెలీనా జైట్లీ బదులిస్తూ.. ‘‘నేను నా భర్త, నా ముగ్గురు పిల్లలను అడిగిన తర్వాత విషయం చెప్తాను’’ అంటూ రిప్లయ్ ఇచ్చింది. సెలీనా స్పందనను నెటిజన్లను మెచ్చుకుంటున్నారు.
Celina Jaitly
marriage proposal
Twitter user
actress reply

More Telugu News