Mallu Bhatti Vikramarka: కేసీఆర్‌తో మ్యాచ్ ఫిక్సింగా..?: మోదీకి సీఎల్పీ నేత భట్టి బహిరంగ లేఖ

CLP leader Bhatti Vikramarka shots off open letter to pm modi ahead of his telangana tour
  • మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో భట్టీ ప్రశ్నల పరంపర 
  • కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ఎందుకు జరపడం లేదని ప్రశ్న
  • కవిత లిక్కర్ స్కాంలో పురోగతి ఎందుకు లేదని నిలదీత
  • కేసీఆర్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అంటూ ఘాటు వ్యాఖ్య

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రధానికి బహిరంగ లేఖ రాశారు. తన 30 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని లేఖలో పేర్కొన్నారు. కాళేశ్వరంపై విచారణ, రాష్ట్రానికి నిధుల కేటాయింపు తరితర అంశాలపై మోదీని ప్రశ్నించారు. 

‘‘మీ 9 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి కేటాయించిన పథకాలు, ప్రాజెక్టులు ఏమిటి? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమలు ఏమయ్యాయి? కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు..మీకు కేసీఆర్‎కున్న లోపాయికార ఒప్పందం ఏమిటీ? కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సహారా, ఈఎస్ఐ కుంభకోణాలపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు? కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉన్న మద్యం కుంభకోణం కేసులో పురోగతి ఎందుకు లేదు.? మీకు కేసీఆర్‎కు మ్యాచ్ ఫిక్సింగ్ అయిందా..? విభజన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు. గిరిజన యూనివర్సిటీ ఏమైంది?’’ అని ప్రశ్నించారు. 

ప్రస్తుతం భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఆయన యాత్రకు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ పాదయాత్రలో భాగంగా భట్టి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. 



  • Loading...

More Telugu News