Jagan: ఏసు ప్రభువు జీవితమే త్యాగానికి చిహ్నం: జగన్

Jagan message on Good Friday
  • గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రజలకు జగన్ సందేశం
  • ప్రభువుకు శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే అని తెలిపిన జగన్
  • గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రెండూ మానవాళి చరిత్రను మలుపుతిప్పాయన్న సీఎం
ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. కరుణామయుడైన ఏసు ప్రభువు జీవితమే త్యాగానికి చిహ్నమని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ ప్రభువుకు శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తర్వాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండు రోజులూ మానవాళి చరిత్రను మలుపుతిప్పిన ఘట్టాలని అన్నారు. తోటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం... ఇదే మానవాళికి జీసస్ ఇచ్చిన సందేశం అని చెప్పారు. 
Jagan
YSRCP
Good Friday

More Telugu News