Prakasam District: మార్కాపురంలో రూపాయికే బిర్యానీ ఆఫర్.. ఎగబడిన జనం.. ట్రాఫిక్ జామ్!

Dum Biryani offer for old one rupee note in Markapuram
  • ప్రకాశం జిల్లా మార్కాపురంలో రెస్టారెంట్ ఓపెనింగ్
  • పాత రూపాయి నోటుకు దమ్ బిర్యానీ ఆఫర్ ప్రకటన
  • జనం తోపులాటలతో మధ్యాహ్నం వరకే పంపిణీ

రూపాయికే దమ్ బిర్యానీ అంటే ఎగబడకుండా ఉంటారా? జనం పొలోమంటూ వచ్చేశారు. దీంతో తోపులాటలు, ట్రాఫిక్ జామూ. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో జరిగిందీ ఘటన. పట్టణంలో నిన్న ఓ రెస్టారెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం ఓ ఆఫర్‌ను ప్రకటించింది. 

పాత రూపాయి నోటుకు దమ్ బిర్యానీ అంటూ ప్రచారం చేసింది. అంతే.. బిర్యానీ ప్రియులు ఆగమేఘాల మీద రెస్టారెంట్ ముందు వాలిపోయారు. పిల్లల నుంచి పెద్దల వరకు బిర్యానీ కోసం పోటీలు పడ్డారు. దీంతో తోపులాట జరిగింది. మార్కాపురం-కంభం రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. జనం తాకిడికి తట్టుకోలేకపోయిన రెస్టారెంట్ యాజమాన్యం మధ్యాహ్నం వరకు బిర్యానీ పంపిణీ చేసి ఆ తర్వాత నిలిపివేసింది. రెస్టారెంట్ ముందు జనం తోపులాటలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News