Vidadala Rajini: జగనన్న ఇది మీరు పెట్టిన భిక్ష: మంత్రి రజని భావోద్వేగం

Vidadalag Rajani gets emotional while talking about Jagan
  • తన రాజకీయ జీవితం జగన్ పెట్టిన భిక్ష అన్న రజని
  • బీసీ మహిళనైన తనను మంత్రిని చేశారంటూ భావోద్వేగం
  • సంక్షేమ పథకాలతో జగన్ చరిత్ర సృష్టిస్తున్నారని కితాబు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తన అభిమానాన్ని రాష్ట్ర ఆరోగ్యమంత్రి విడదల రజని చాటుకున్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వేదికగా ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదికపై నుంచి రజని ప్రసంగిస్తూ తాను జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ఒక సాధారణ బీసీ మహిళ అయిన తనకు చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారని, మంత్రిగా అవకాశం ఇచ్చారని అన్నారు. ఈ రాజకీయ జీవితం, మంత్రి పదవి జగన్ పెట్టిన భిక్ష అని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

జగనన్న ఆరోగ్య సంస్కర్త అని రజని కొనియాడారు. పేదల గుండెల్లో నిలిచిన నేత అని అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి వచ్చిన జగన్ కు ఇక్కడి ప్రజల తరపున పాదాభివందనాలతో స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. సంక్షేమ పథకాలతో జగన్ చరిత్ర సృష్టిస్తున్నారని అన్నారు.

Vidadala Rajini
Jagan
YSRCP

More Telugu News