Dil Raju: నేను ఫస్టు టైమ్ డబ్బులు పోగొట్టుకుంది ఆ సినిమాతోనే: దిల్ రాజు

  • 20 ఏళ్ల కెరియర్ చూశానన్న దిల్ రాజు 
  • మూడు సార్లు గ్రాఫ్ పడిపోయిందని వ్యాఖ్య 
  • 'రామరామ కృష్ణకృష్ణ' దెబ్బకొట్టేసిందని వెల్లడి 
  • 'జోష్' నిరాశ పరిచిందని వివరణ   
Dil Raju Interview

నిర్మాతగా దిల్ రాజుకి మంచి అనుభవం ఉంది. ఆయన ఖాతాలోనూ పరాజయాలు ఉన్నప్పటికీ, కథ విషయంలో ఆయన జడ్జిమెంట్ చాలా కరెక్టుగా ఉంటుందని చాలామంది అంటారు. కెరియర్ పరంగా 20 ఏళ్లను పూర్తిచేసుకున్న దిల్ రాజు, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "సూపర్ హిట్ కొట్టాలనే ఆలోచనతోనే నేను రంగంలోకి దిగుతూ ఉంటాను. ఒకవేళ తేడా కొట్టినా కనీసం యావరేజ్ గా నైనా నిలుస్తాయనేది నా ఉద్దేశం" అన్నారు.

"నా 20 ఏళ్ల కెరియర్ లో నేను మూడు సార్లు డౌన్ లోకి వెళ్లి, మళ్లీ పుంజుకున్నాను. 'రామరామ కృష్ణకృష్ణ' సినిమా బాగానే ఆడింది. కానీ ఆ సినిమా ఖర్చుకు తగినంత రాబట్టలేకపోయింది. నేను మొదటిసారిగా డబ్బు నష్టపోయింది ఈ సినిమాతోనే. అప్పటివరకూ నేను డబ్బు నష్టపోలేదు. అదే సమయంలో 'జోష్' సినిమాతో చైతూను పరిచయం చేశాను. ఆ సినిమా కూడా దెబ్బకొట్టేసింది" అని చెప్పారు. 

"అలాంటి పరిస్థితుల్లో వంశీ 'బృందావనం' లైన్ చెప్పారు. మొదటిసారిగా స్టార్ హీరోతో నేను చేసిన సినిమానే 'బృందావనం'. ఆ సినిమా .. ఆ తరువాత చేసిన 'మిస్టర్ పెర్ఫెక్ట్' సినిమాలు ముందుకు తీసుకుని పోయాయి. ఆ తరువాత చేసిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' .. 'ఎవడు' వంటి హిట్లు మరింత ముందుకు తీసుకుని వెళ్లాయి" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News