Shahrukh Khan: నాకు 80 ఏళ్లు వచ్చినా షారుఖ్ తో రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి రెడీ: రాణీ ముఖర్జీ

I am ready to act in romantic scenes with Shahrukh Khan says Rani Mukerji
  • పలు హిట్ చిత్రాల్లో నటించిన రాణీ ముఖర్జీ, షారుఖ్
  • ఇప్పుడు కూడా షారుఖ్ తో నటించడం ఇష్టమేనన్న రాణి   
  • తమ కోసం ఒక మంచి లవ్ స్టోరీని రాయాలని రైటర్లకు సూచన
బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ పెయిర్లలో షారుఖ్ ఖాన్, రాణీ ముఖర్జీ జంట ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన కుచ్ కుచ్ హోతాహై, చల్తే చల్తే, కభీ అల్విదా నా కెహ్నా వంటి సినిమాలను సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. తొలి నుంచి కూడా వీరిద్దరి మధ్య మంచి స్నేహం, అనుబంధం ఉంది. తాజగా రాణీ ముఖర్జీ 'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే' సినిమాలో నటించారు. తాజాగా ఈ సినిమా టీమ్ అందరినీ అభినందిస్తూ షారుఖ్ ట్వీట్ చేశారు. 

మరోవైపు, రాణీ ముఖర్జీ తాజాగా ఈ సినిమాకు చెందిన కార్యక్రమంలో మాట్లాడుతూ షారుఖ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ స్టోరీ రైటర్స్ అందరికీ తాను ఇప్పుడే చెపుతున్నానని... ఒక మంచి మెచ్యూర్డ్ లవ్ స్టోరీని తనకు, షారుఖ్ కు రాయాలని, ఇద్దరం కలిసి నటిస్తామని చెప్పారు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా షారుఖ్ తో కలిసి నటించడం తనకు ఇష్టమేనని అన్నారు. తనకు 80 ఏళ్ల వయసు వచ్చినా షారుఖ్ తో లవ్ స్టోరీలు చేయడానికి, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి తాను సిద్ధమని చెప్పారు. రాణీ ముఖర్జీ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Shahrukh Khan
Bollywood
Rani Mukerji

More Telugu News