Tamilnadu: యువకుడి పైశాచికత్వం.. పాము తలను కొరికి వేరు చేసిన వైనం

Three Tamil Nadu men held for biting off snakes head recording act
  • తమిళనాడులో వెలుగు చూసిన ఘటన
  • యువకుడి దారుణానికి సంబంధించిన వీడియో వైరల్
  • పర్యావరణ ప్రేమికుల ఫిర్యాదుతో ముగ్గురు నిందితుల అరెస్ట్
తమిళనాడులో తాజాగా ఓ పైశాచిక ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడు పాము తలను కొరికి వేరు చేశాడు. రాణిపేటలో జరిగిన ఈ ఉదంతంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడు పాము తలను కొరుకుతుండగా అతడి స్నేహితులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

మోహన్ అనే యువకుడు పామును చేతపట్టి దాని తలను నోటితో కొరికి వేరుచేశాడు. పాము తనను కాటేసిందంటూ ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతడి ఇద్దరు స్నేహితులు తొలుత వారించినా వినిపించుకోకుండా ఈ పనికి పాల్పడ్డాడు. కాగా.. రక్తమోడుతున్న పామును చూసి ఆ ముగ్గురు యువకులు ఆనందించడం వీడియోలో రికార్డయింది. ఈ ఘటన గురించి పర్యావరణ కార్యకర్తలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో నిందితులు కటకటాల పాలయ్యారు. అడవి జంతువులపై కర్కశత్వం ప్రదర్శించడం, వాటిని చంపడం తదితర సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు.
Tamilnadu
Crime News

More Telugu News