Kolagatla: సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు అప్పులు ఉండవా?: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్

AP Deputy speaker Kolagatla praises Jagan
  • ఎన్టీఆర్ రూ. 2కి కిలో బియ్యం ఇచ్చినప్పుడు కూడా ప్రజలపై భారం పడిందన్న కోలగట్ల
  • అన్ని హామీలను జగన్ మాట తప్పకుండా అమలు చేస్తున్నారని కితాబు
  • జగన్ కు ప్రజల్లో ఆదరణ పెరగడం వల్లే విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపాటు
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో కిలో బియ్యాన్ని 2 రూపాయలకు అందించినప్పుడు కూడా ప్రజలపై భారం పడిందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ఇప్పుడు తమ వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని... పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నప్పుడు ప్రభుత్వం అప్పులు చేయడం సహజమని చెప్పారు. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్ మాట తప్పకుండా అమలు చేస్తున్నారని అన్నారు. వాగ్దానాలను అమలు చేయకపోవడం వల్లే చంద్రబాబు ఓడిపోయారని చెప్పారు. రోజురోజుకు జగన్ కు ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నందువల్లే విపక్ష నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
Kolagatla
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News