Bandi Sanjay: బండి సంజయ్ తో పాటు మరో ముగ్గురు కరీంనగర్ జైలుకు తరలింపు

Bandi Sanjay sent to Karimnagar jail in paper leak case
  • పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్
  • బెయిల్ పిటిషన్ ను రేపు విచారించనున్న కోర్టు
  • సంజయ్ కు ఇచ్చే ఆహారాన్ని పరీక్షించాలని ఆదేశించిన కోర్టు
పదో తరగతి పేపర్ లీకేజ్ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ప్రశాంత్, మహేశ్, శివగణేశ్ లకు కు కోర్టు రిమాండ్ విధించింది. మరోవైపు సంజయ్ వేసిన బెయిల్ పిటిషన్ ను రేపు విచారిస్తామని కోర్టు ప్రకటించింది. ఈ క్రమంలో సంజయ్ తో పాటు ఇతరులను భారీ బందోబస్తు మధ్య కరీంనగర్ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. 

మరోవైపు బండి సంజయ్ కు ఇచ్చే ఆహారాన్ని పరీక్షించాలని కోర్టును ఆయన తరపు లాయర్లు కోరారు. దీంతో, ఆయనకు ఇచ్చే ఆహారాన్ని పరీక్షించి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రేపు ఉదయం 10.30 గంటలకు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ ను కోర్టు విచారించనుంది. ఇదే సమయంలో రేపు పోలీసులు సంజయ్ ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేయనున్నారు.
Bandi Sanjay
BJP
Jail
Remand

More Telugu News