Nara Lokesh: పాదయాత్రలో నారా లోకేశ్ కు తప్పిన ప్రమాదం

Nara Lokesh escaped from accident
  • ఈరోజు రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గాల్లో కొనసాగిన లోకేశ్ పాదయాత్ర
  • లోకేశ్ ను గజమాలతో సత్కరించిన టీడీపీ అభిమానులు
  • గజమాల తెగి లోకేశ్ పై పడిన వైనం
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఈరోజు రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో కొనసాగింది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఆయన పాదయాత్ర ముందుకు సాగింది. ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో లోకేశ్ కు ప్రమాదం తప్పింది. పాదయాత్ర సందర్భంగా కూడేరులో టీడీపీ అభిమానులు లోకేశ్ ను గజమాలతో సత్కరించే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. 

భారీ గజమాలను క్రేన్ సహాయంతో లోకేశ్ కు వేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో క్రేన్ వైర్లు తెగాయి. దీంతో, మాల ఆయనపై పడింది. అయితే లోకేశ్ వెంటనే అప్రమత్తమై తప్పించుకున్నారు. దీంతో, ఆయనకు ప్రమాదం తప్పింది. లోకేశ్ కు ఏమీ కాకపోవడంతో అక్కడున్న టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
Nara Lokesh
Telugudesam
Gajamala
Accident

More Telugu News