Sensex: వరుసగా నాలుగో రోజు లాభాలను మూటకట్టుకున్న మార్కెట్లు

  • 583 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 159 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతం వరకు లాభపడ్డ ఎల్ అండ్ టీ షేరు విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ను సానుకూలంగా ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు లాభాల్లోనే కొనసాగాయి. ఈ క్రమంలో వరుసగా నాలుగో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ మన మార్కెట్లు లాభాలను నమోదు చేయడం గమనార్హం. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 583 పాయింట్లు లాభపడి 59,689కి పెరిగింది. నిఫ్టీ 159 పాయింట్లు పుంజుకుని 17,557కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (3.96%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.97%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.72%), సన్ ఫార్మా (1.93%), ఐటీసీ (1.93%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.26%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.24%), ఎన్టీపీసీ (-1.01%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.73%), మారుతి (-0.57%).

More Telugu News