Bandi Sanjay: బండి సంజయ్ అరెస్టుపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్

Habeas corpus petition Filed in High court over Bandi Sanjay arrest
  • నిన్న రాత్రి సంజయ్ ను అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు
  • ఎఫ్ఐఆర్ వివరాలు వెల్లడించని వైనం
  • హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ లీగల్ సెల్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అరెస్ట్‌‌పై తెలంగాణ హైకోర్టులో తెలంగాణ బీజేపీ లీగల్ సెల్ పిటిషన్‌ను దాఖలు చేసింది. సంజయ్‌ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. కాగా, బండి సంజయ్‌ను కరీంనగర్‌ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు. కరీంనగర్‌ జ్యోతి నగర్‌లోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులోనే సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కోర్టులో హాజరు పరిచనున్నారు. కానీ, ఏ కేసులో అరెస్ట్ చేశారు? ఎఫ్ఐఆర్ వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు. మరోవైపు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది.
Bandi Sanjay
BJP
Telangana
arrest
TS High Court
Habeas corpus

More Telugu News