BJP: బండి సంజయ్ అరెస్ట్ పై స్పందించిన ఆయన భార్య

Bandi sanjay wife reacts on her husbends arrest
  • తన తల్లి చిన్న కర్మ కార్యక్రమంలో పాల్గొనకుండా చేశారని ఆవేదన
  • అరెస్ట్ చేసేప్పుడు కనీసం ట్యాబ్లెట్ కూడా వేసుకోనివ్వలేదన్న అపర్ణ
  • నిన్న అర్ధరాత్రి కరీంనగర్ లో సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ను కరీంనగర్ పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేసిన తీరుపై ఆయన భార్య అపర్ణ స్పందించారు. అరెస్ట్ చేసే సమయంలో సంజయ్ కు పోలీసులు టాబ్లెట్స్ వేసుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మంచి నీళ్లు తాగేందుకు కూడా అనుమతివ్వలేదన్నారు. తన భర్తతో పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారన్నారు. కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేదన్నారు. అరెస్ట్ సమయంలో ఆయన ముఖానికి గాయం కూడా అయిందన్నారు. తన తల్లి చిన్న కర్మలో సంజయ్ పాల్గొనకుండా చేశారన్నారు. అల్లుడు, కూతురు చేయాల్సిన కార్యక్రమాన్ని సైతం అడ్డుకున్నారని అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలు చెప్పి విజ్ఞప్తి చేసినా పోలీసులు వినలేదన్నారు. 

కాగా, అర్ధరాత్రి 12 గంటల తర్వాత సుమారు 100 మంది పోలీసులు సంజయ్‌ ఇంటిని చుట్టుముట్టారు. ఆయనను అరెస్టు చేసే సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని సంజయ్‌ కోరితే, అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందంటూ పోలీసులు జవాబు ఇచ్చారని బీజేపీ వర్గాలు తెలిపాయి. పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ విషయంలోనే బండి సంజయ్ ను అరెస్టు చేసినట్టు పోలీసు వర్గాల సమాచారం. 
BJP
Bandi Sanjay
arrest
wife
Police

More Telugu News