Nara Lokesh: ఎన్నికల ముందు నేల జగన్... ఇప్పుడు గాలి జగన్!: అనంతపురంలో లోకేశ్

  • అనంతపురం నియోజకవర్గంలో ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర
  • విజయనగర్ కాలనీలో సభ
  • భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు
  • ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకు జగన్ అహంకారం నేలకు దిగొచ్చిందని వెల్లడి
Lokesh Yuvagalam Padayatra enters into Anantapur constituency

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర అనంతపురం నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ సందర్భంగా అనంతపురం విజయనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ ప్రసంగించారు. 

ఇది ఎంతో పుణ్యభూమి అని పేర్కొన్నారు. ఇక్కడి ఎస్కే యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇదే యూనివర్సిటీలో చదివిన నీలం సంజీవయ్య రాష్ట్రపతులు అయ్యారని, అలాంటి గడ్డపై తాను పాదయాత్ర చేయడం తన అదృష్టం అని లోకేశ్ పేర్కొన్నారు. 

ఈ సభలో సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఎన్నికల ముందు నేల జగన్ ను చూశామని, ఆ ఎన్నికలు అయిపోగానే గాలి జగన్ గా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకు జగన్ అహంకారం నేలపైకి వచ్చిందని అన్నారు. నిన్నటి వరకు సింహం సింగిల్ గా వస్తుందని అన్నాడని, ఇప్పుడేమో ఒంటరిగానే పోటీ చేయాలని ప్రతిపక్షాలను అడుక్కుంటున్నాడని విమర్శించారు. అవినీతిపై మాట్లాడినందుకు సొంత ఎమ్మెల్యేలపైనే కేసులు పెట్టాడని ఆరోపించారు. 

తమను ఎంత వేధించినా సహించామని, కానీ ప్రజల జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టబోమని లోకేశ్ హెచ్చరించారు. ఓ బటన్ నొక్కితే అంతా అయిపోతుందా... రాష్ట్రానికి ఇప్పటివరకు ఏం పీకారంట? అని నిలదీశారు. తాము తెచ్చిన 100 సంక్షేమ పథకాలను తొలగించడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడని వ్యంగ్యం ప్రదర్శించారు.

More Telugu News