Raghu Rama Krishna Raju: రామోజీరావు గారిని విచారిస్తున్న ఫొటో ఈ 'సాక్షి'కి ఎలా వచ్చింది?: రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju reacts on Ramoji Rao photo
  • మార్గదర్శి కేసులో రామోజీరావుపై సీఐడీ విచారణ
  • రామోజీరావును ఇంటి వద్దే ప్రశ్నించిన అధికారులు
  • బయటికి వచ్చిన ఫొటో
మార్గదర్శి చిట్స్ వ్యవహారంలో రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావును సీఐడీ అధికారులు విచారించడం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు తన కుమారుడు కిరణ్ నివాసంలో చికిత్స పొందుతున్నారు. రామోజీరావు బెడ్ పై పడుకుని ఉండగా, సీఐడీ అధికారులు ఆయనను దాదాపు 5 గంటలకు పైగా ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఫొటో బయటికి వచ్చింది. 

దీనిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. రామోజీరావు గారిని విచారిస్తున్న ఫొటో ఈ 'సాక్షి'కి ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. సాక్షి చానల్లో రామోజీరావు గారిని 'రామోజీరావు' అని, 'అతడు' అని ఏకవచనంతో సంబోధించడం అత్యంత దారుణం అని పేర్కొన్నారు. పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న వారిని 32 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి చానల్లో ఇలా సంబోధించడాన్ని మనమందరం ఖండించాలని రఘురామ పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
Raghu Rama Krishna Raju
Ramoji Rao
Margadarsi
CID
YSRCP
Andhra Pradesh

More Telugu News