MS Dhoni: ఐపీఎల్ రేటింగ్ ల్లో ధోనీ రికార్డులు

MS Dhoni smashes own record as IPL 2023 viewership reaches new high during his CSK skipper vs LSG
  • ధోనీ ఆడే మ్యాచ్ లకు క్రేజీ ఎక్కువ
  • గుజరాత్ తో మ్యాచ్ కు 1.6 కోట్ల వీక్షణలు
  • లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ కు 1.7 కోట్ల వీక్షణలు
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజీ ఏ పాటిదో తెలియనిది కాదు. 41 ఏళ్ల వయసులోనూ ధోనీ చెన్నై జట్టును ప్రస్తుత సీజన్ లో నడిపిస్తున్నాడు. ఇప్పటికీ అతడు బ్యాట్ తో క్రీజులోకి దిగితే బౌలర్లకు చెమటలు పోయాల్సిందే. లక్నో జట్టుతో మ్యాచ్ లో ఇదే నిరూపితమైంది. మూడే బంతులు ఎదుర్కొన్న ధోనీ, రెండింటినీ సునాయాసంగా సిక్సర్లుగా మలిచిన తీరు అతడి అనుభవానికి మచ్చు తునక. మ్యాచ్ ఫినిషర్ గా ధోనీ రికార్డు చాలా ప్రత్యేకం. 

తాజా ఐపీఎల్ సీజన్ లోనూ ధోనీ పట్ల అభిమానం వెల్లివిరుస్తోంది. ఇందుకు నిదర్శనం ధోనీ ఆడే మ్యాచ్ లకు వస్తున్న వ్యూస్ అని చెప్పుకోవాలి. జియో సినిమా యాప్ లో ఐపీఎల్ మ్యాచ్ లను ఉచితంగా వీక్షించొచ్చు. గుజరాత్ తో చెన్నై జట్టు తొలి మ్యాచ్ లో భాగంగా మార్చి 31న తలపడడం తెలిసిందే. ఆ రోజు మ్యాచ్ ను 1.6 కోట్ల మంది చూశారు. ఇక చెన్నైలోని చెపాక్ స్టేడియంలో లక్నో జట్టుతో, చెన్నై జట్టు సోమవారం తలపడింది. ఈ మ్యాచ్ లో భాగంగా ధోనీ బ్యాటింగ్ సమయంలో 1.7 కోట్ల మంది చూడడం విశేషం.
MS Dhoni
viewership
record
IPL 2023
jio cinema

More Telugu News