Samantha Ruth Prabhu: నేను ఇలా చెప్పలేదు: ఖండించిన సమంత

Samantha Ruth Prabhu denies talking about Naga Chaitanya and Shobhita Dhulipala dating rumours
  • నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల డేటింగ్ పై వార్తలు
  • ఇప్పటికైనా మారితే మంచిదని సమంత అన్నట్టుగా ప్రచారం
  • తాను ఎప్పుడూ ఇలా చెప్పలేదంటూ ట్విట్టర్ లో సమంత స్పష్టీకరణ
నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల డేటింగ్ పై తాను స్పందించినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ నటి సమంత రుతు ప్రభు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేసింది.

నటి సమంత రుతు ప్రభు సియాసత్ పత్రికతో మాట్లాడిన సందర్భంగా.. నాగ చైతన్య, శోభిత డేటింగ్ పై స్పందించినట్టు వార్తలు ఈ రోజు వెలుగు చూశాయి. సమంత స్పందనపై గ్రేట్ ఆంధ్రాలో వచ్చిన కథనాన్ని సమంత తన ట్విట్టర్ పేజీలో ట్యాగ్ చేసింది. ‘‘నేను దీన్ని ఎప్పుడూ చెప్పలేదు’’అని స్పష్టం చేసింది. అంటే సమంత చెప్పకపోయినా.. ఆమె చెప్పినట్టుగా వార్తలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. 

సియాసత్ పత్రికకు సమంత ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా ఈ రోజు చాలా మీడియా సంస్థల్లో కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో ఆమె స్పందించినట్టు అర్థమవుతోంది.
Samantha Ruth Prabhu
Naga Chaitanya
Shobhita Dhulipala
dating rumours

More Telugu News