Nani: నాని కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా 'దసరా '

Dasara Movie Update
  • నాని తాజా చిత్రంగా వచ్చిన 'దసరా'
  • మాస్ హీరోగా నానీని నిరూపించిన సినిమా
  • తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో 59.80 కోట్ల గ్రాస్
  • ప్రపంచవ్యాప్తంగా 92 కోట్ల గ్రాస్

తనకి పూర్తి మాస్ యాక్షన్ సినిమా చేయాలనుందని నాని చాలా ఇంటర్వ్యూలలో చాలా కాలం నుంచి చెబుతూ వస్తున్నాడు. 'దసరా' సినిమాతో ఆయన ముచ్చట తీరింది. ఇక నాని మాస్ యాక్షన్ చేస్తే చూసేదెవరు? ఆయనకి ఫ్యామిలీ కథలు మాత్రమే సెట్ అవుతాయి అని చాలామంది అనుకున్నారు. 

కానీ 'దసరా'' సినిమా చూసిన తరువాత నానీలో మంచి మాస్ హీరో ఉన్నాడనే విషయం అందరికీ అర్థమైంది. ఇంట్రడక్షన్ సీన్ లోను .. క్లైమాక్స్ లోను మాస్ హీరోగా నాని తన విశ్వరూపం చూపించాడు. ఆయన నటన పట్ల సీనియర్ స్టార్స్ మొదలు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. 

నాని కెరియర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5 రోజుల్లో 59.80 కోట్ల గ్రాస్ .. 35.44 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 92 కోట్ల గ్రాస్ .. 50.48 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ రోజునో .. రేపో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయమే. 

Nani
Keerthi Suresh
Dasara Movie

More Telugu News