మారిన ట్విట్టర్ లోగో.. యూజర్లలో అయోమయం
- కొంత సమయం పాటు మారిపోయిన ట్విట్టర్ లోగో
- ట్విట్టర్ లోగోలో కనిపించిన డోజికాయిన్ కుక్క
- దీంతో డోజికాయన్ ధర 20 శాతం ర్యాలీ
క్రిప్టోకరెన్సీ డోజి కాయిన్ కు మద్దతుగా పిరమిడ్ స్కీమ్ నిర్వహిస్తున్నాడంటూ ఎలాన్ మస్క్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను కొట్టి వేయాలంటూ, ఆయన చేసిన అభ్యర్థనను యూఎస్ జడ్జి కొట్టివేశారు. అనంతరం లోగో మార్చి మస్క్ తన నిరసనను ఇలా తెలిసేలా చేశారు. దీనిపై మీమ్స్ పెద్ద ఎత్తున నడిచాయి. ట్విట్టర్ యూజర్లు తెగ ట్రోల్ చేశారు.