Nara Lokesh: ధర్మవరంలో ఏ కబ్జా కదిపినా ‘కేటురెడ్డి’దే.. లోకేశ్ సెటైర్

lokesh yuvagalam in dharmavaram constituency
  • ధర్మవరంలో కొనసాగుతున్న యువగళం పాదయాత్ర
  • కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి  టార్గెట్ గా నారా లోకేశ్ విమర్శలు
  • కేతిరెడ్డి యాక్టింగ్ మంగ‌ళ‌గిరి క‌ర‌క‌ట్ట క‌మ‌ల్ హాస‌న్‌ని మించిపోతోందని ఎద్దేవా
  • ఏ అక్ర‌మం అడ్ర‌స్ లాగినా ఆయన ద‌గ్గ‌రే తేలుతోందని ఆరోపణ
టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం సత్యసాయి జిల్లా ధర్మవరంలో కొనసాగుతోంది. సోమవారం ఉదయం 59వ రోజు యాత్ర ప్రారంభమైంది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి టార్గెట్ గా లోకేశ్ విమర్శలు కొనసాగిస్తున్నారు. గుడ్ మార్నింగ్ అంటూ వీధుల్లో షో చేసే యూట్యూబ్ స్టార్ కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి చేసేవి కబ్జాలు, ఇసుక దందాలు, సెటిల్మెంట్లు అని నిన్న లోకేశ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ రోజు మరోసారి ట్విట్టర్ లో సెటైర్లు వేశారు.

‘‘ప్ర‌తీ రోజూ ధ‌ర్మ‌వ‌రం వీధుల్లో నీ యాక్టింగ్ మా మంగ‌ళ‌గిరి క‌ర‌క‌ట్ట క‌మ‌ల్ హాస‌న్‌ని మించిపోతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఏ అక్ర‌మం అడ్ర‌స్ లాగినా నీ ద‌గ్గ‌రే తేలుతోంది. ఏ క‌బ్జా క‌దిపినా గుడ్ మార్నింగ్ కేటురెడ్డిదేన‌ని స్ప‌ష్టం అవుతోంది’’ అని ఎద్దేవా చేశారు. 

‘‘చిత్రావ‌తి న‌ది ఉప్ప‌ల‌పాడు రీచ్ నుంచి త‌ర‌లించే టిప్ప‌ర్ల‌న్నీ కేటువేనంటున్నారు. మ‌న గుడ్ మార్నింగ్ షూటింగ్‌లో ఎర్రగుట్ట క‌బ్జా, చెరువు పూడ్చి ఫాంహౌస్ క‌ట్టుకోవ‌డం, వంద‌ల ఎక‌రాల క‌బ్జా, చిత్రావ‌తి న‌ది నుంచి ఇసుక మాఫియా ఎపిసోడ్ల స్కిట్ల షూట్‌కి ఎప్పుడూ ప్లాన్ చేయ‌లేదా!’’ అని లోకేశ్ ప్రశ్నించారు. గుడ్ మార్నింగ్ మహానటుడు’ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.
Nara Lokesh
YuvaGalam Padayatra
dharmavaram
kethireddy venkatarami reddy
YSRCP
TDP

More Telugu News