Srilakshmi: అందరినీ నవ్వించాను .. మా ఇంట్లో మాత్రం తీరని దుఃఖం: నటి శ్రీలక్ష్మి

  • తమ్ముడు రాజేశ్ గురించి ప్రస్తావించిన శ్రీలక్ష్మి 
  • హీరోగా చాలా వేగంగా ఎదుగుతున్నాడని ఆనందించామని వెల్లడి
  • అతని మరణం కలచివేసిందని వ్యాఖ్య 
  • ప్రమాదంలో ఆయన ఇద్దరు పిల్లలు పోయారంటూ ఆవేదన
Sri Lakshmi Interview

తెలుగు సినిమా హాస్య నటులలో శ్రీలక్ష్మి స్థానం ప్రత్యేకం. నటిగా ఆమె ప్రయాణం మొదలై 41 ఏళ్లు పూర్తయ్యాయి. తాజా ఇంటర్వ్యూలో శ్రీలక్ష్మి మాట్లాడుతూ .. "నటిగా నా ప్రయాణం మొదలైన తరువాత ఇక నేను వెనుదిరిగి చూసుకోలేదు. జంధ్యాలగారు నా పాత్రలను డిజైన్ చేసిన తీరు .. నా కోసం సెట్ చేసిన మేనరిజమ్స్ నా కెరియర్ కి ఎంతో హెల్ప్ అయ్యాయి" అని అన్నారు.  

'రెండుజెళ్ల సీత' సినిమా నుంచి 13 ఏళ్లపాటు 'బెస్ట్ కమెడియన్' గా అవార్డు అందుకుంటూ వచ్చాను. నా తరువాత కొన్నేళ్లకి మా తమ్ముడు రాజేశ్ సినిమాల్లోకి వచ్చాడు. కెరియర్ ను చాలా సీరియస్ గా తీసుకుని ఎదుగుతూ వచ్చాడు. 'రెండుజెళ్ల సీత' .. 'ఆనందభైరవి' ... 'మల్లెమొగ్గలు' వంటి మంచి సినిమాలు చేశాడు" అని చెప్పారు. 

"హీరోగా మా రాజేశ్ చాలా ఫాస్టుగా ఎదిగాడు. కానీ ఎంత స్పీడ్ గా వచ్చాడో అంతే స్పీడ్ గా వెళ్లిపోవడం మేము చేసుకున్న దురదృష్టం. రాజేశ్ కి నలుగురు పిల్లలు. ఆ మధ్య జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఇంతమందిని ఇంత కాలంగా నవ్విస్తూ వచ్చిన మా ఇంట్లో ఈ విషాదకరమైన సంఘటనలేమిటి? అని అనిపిస్తూ ఉంటుంది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News