Sujana Chowdary: టీడీపీ నేత ఆలపాటి నివాసానికి సుజనా చౌదరి

Sujana Chowdary met TDP leaders at Alapati Raja residence
  • రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం
  • ఆలపాటి రాజా నివాసంలో సమావేశం
  • హాజరైన సుజనా, నక్కా ఆనంద్ బాబు, కన్నా 
  • వైసీపీ సర్కారును తరిమేస్తేనే ఏపీకి మంచి రోజులు వస్తాయన్న సుజనా
  • ఏపీ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందన్న ఆలపాటి
ఏపీ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నివాసానికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వచ్చారు. ఈ సందర్భంగా ఆలపాటి నివాసంలో సమావేశం జరిగింది. ఈ భేటీలో టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, కన్నా లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు. నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ, వైసీపీ సర్కారును తరిమేస్తేనే ఏపీకి మంచి రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు. అమరావతిలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు. ఇకనైనా వైసీపీ తీరు మార్చుకుంటే మంచిదని సుజనా హితవు పలికారు. 

ఆలపాటి రాజా మాట్లాడుతూ, ఏపీ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతుందేమోనన్న ఆందోళన ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
Sujana Chowdary
Alapati Raja
Nakka Anand Babu
Kanna Lakshminarayana
TDP
BJP

More Telugu News