Kamareddy District: ఏటీఎం రిపేర్ చేస్తానంటూ వచ్చి చోరీ

  • కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన ఘటన
  • ఏటీఎం చెడిపోవడంతో రిపేర్ కంపెనీకి సమాచారమిచ్చిన సిబ్బంది
  • రిపేర్ కంపెనీ నుంచి వచ్చానంటూ బ్యాంకులో ప్రత్యక్షమైన నిందితుడు
  • అతడు వెళ్లిపోయాక ఏటీఎంలో రూ.50 వేలు మాయమైనట్టు గుర్తించిన సిబ్బంది
  • వెంటనే పోలీసులకు ఫిర్యాదు
  • నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు
Man steals money from Axis bank ATM on the pretext of repairing it in kamareddy

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ జరిగింది. బ్యాంకు సిబ్బంది సమాచారంతో ఏటీఎం రిపేర్ చేసేందుకు వచ్చిన ఓ దొంగ ఏకంగా నగదుతో ఉడాయించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొత్త సాయిబాబా గుడి రోడ్డులోని ఓ ఏటీఎం చెడిపోవడంతో బ్యాంకు సిబ్బంది.. ఏటీఎం రిపేర్ చేసే కంపెనీకి ఫోన్ చేశారు. 

కాసేపటి తరువాత ఏటీఎం రిపేర్ కంపెనీ ఉద్యోగినంటూ ఓ వ్యక్తి బ్యాంకులో ప్రత్యక్షమయ్యాడు. ఏటీఎంకు మరమ్మతులు చేసి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయాక బ్యాంకు సిబ్బందికి ఊహించని షాక్ తగిలింది. ఏటీఎం నగదులో రూ.50 వేల మేర తక్కువగా ఉన్నట్టు గుర్తించి నివ్వెరపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆగంతుకుడి జాడ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికంగా కలకలం రేపుతున్న ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News