kanthara hero: రాజకీయాల్లోకి రిషబ్ శెట్టి..? హీరో ఏమంటున్నాడంటే..

Kantara movie fame Rishab Shetty Reaction About His Political entry rumours
  • రిషబ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ కన్నడ ఇండస్ట్రీలో ప్రచారం
  • తమిళనాడుకు చెందిన జర్నలిస్ట్ ఒకరు ట్వీట్ చేయడంతో వైరల్
  • తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందన్న కాంతారా హీరో రిషబ్ శెట్టి
కాంతారా చిత్రంతో దేశవిదేశాల్లో క్రేజ్ సంపాదించుకున్న హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తమిళనాడుకు చెందిన ఓ జర్నలిస్ట్ ట్వీట్ చేయడంతో ఈ ప్రచారం మొదలైంది. రాజకీయాల్లోకి వస్తే అండగా ఉంటామంటూ ఆయన అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారంపై తాజాగా రిషబ్ శెట్టి స్పందించారు. తనకు రాజకీయాల్లోకి రావాలని లేదని తేల్చిచెప్పారు. తన సినిమాలకు మాత్రం మద్దతివ్వాలంటూ అభిమానులు, ప్రేక్షకులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేనని రిషబ్ స్పష్టం చేశారు. గతంలోనూ ఇలాగే ప్రచారం జరిగిందని గుర్తుచేశారు. తమ పార్టీకి మద్దతివ్వాలంటూ కొంతమంది రాజకీయ నేతలు అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే, తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని వివరించారు. తన సినిమాలకు అండగా ఉండాలని, థియేటర్లకు వెళ్లి చూడాలని రిషబ్ శెట్టి అభిమానులను కోరారు.
kanthara hero
rishab shetti
political entry
hero reaction
rumours

More Telugu News