Kyle Mayers: కసిదీరా బాదిన కైల్ మేయర్స్... సూపర్ జెయింట్స్ భారీ స్కోరు

Kyle Mayers blistering knock powers Lucnow Supergiants to 193 runs
  • ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన సూపర్ జెయింట్స్
  • 38 బంతుల్లో 73 పరుగులు చేసిన కైల్ మేయర్స్
టీ20 క్రికెట్ అంటేనే బాదుడుకు మారు పేరు. అందులోనూ ఐపీఎల్ అంటే ఇక చెప్పేదేముంది! ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్ కైల్ మేయర్స్ మొదలుకొని ఆఖర్లో వచ్చిన కృష్ణప్ప గౌతమ్ వరకు బంతిని కసిదీరా బాదారు. దాంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

కెప్టెన్ కేఎల్ రాహుల్ (8) ఆరంభంలోనే అవుటైనా, మరో ఓపెనర్ కైల్ మేయర్స్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. మేయర్స్ కేవలం 38 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 2 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. 

మిడిలార్డర్ లో నికోలాస్ పూరన్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 36 పరుగులు చేశాడు. ఆయుష్ బదోనీ 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు కొట్టగా... ఇన్నింగ్స్ చివరి బంతికి బ్యాటింగ్ కు దిగిన 'ఇంపాక్ట్ ప్లేయర్' కృష్ణప్ప గౌతమ్ భారీ సిక్స్ తో ఇన్నింగ్స్ ముగించాడు.
Kyle Mayers
Lucnow Super Giants
Batting
Delhi Capitals

More Telugu News