రవితేజ గురించి రాజమౌళి ఒక మాటన్నారు: గోపీచంద్ మలినేని

  • శిల్పకళావేదికలో 'రావణాసుర' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • రవితేజతో తన జర్నీ గురించి ప్రస్తావించిన గోపీచంద్ మలినేని
  • ఆయనతో 3 సినిమాలు చేయడం అదృష్టమని వెల్లడి 
  • పాత్ర ఏదైనా ఆయన ఇరగదీసేస్తాడని వ్యాఖ్య

Ravanasura Pre Release Event

రవితేజ కథానాయకుడిగా రూపొందిన 'రావణాసుర' ఈ నెల 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదు - శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. ఈ వేదికపై గోపీచంద్ మలినేని మాట్లాడుతూ .. "ఈ రోజున నాలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఉండటానికి కారణం రవితేజనే. ఏ కేరక్టర్ ఇచ్చినా ఆయన ఇరగదీసేస్తాడు" అని చెప్పాడు.  

రవితేజతో మూడు సినిమాలు చేయడం నా అదృష్టం. నన్ను చూసిన వాళ్లంతా నేను రవితేజ బ్రదర్ ని అనుకుంటారు. నిజంగానే నేను ఆయనకి తమ్ముడులాంటి వాడిని. రవితేజ హీరోగానే దర్శకుడిగా నా కెరియర్ మొదలైంది. ఆయనతో నేను చేసిన ఫస్టు సినిమా 'డాన్ శీను' .. ఆ సినిమాకి గెస్టుగా రాజమౌళిని ఆహ్వానించడానికి వెళ్లాను" అని చెప్పాడు. 

"రాజమౌళి గారిని కలిసి విషయం చెప్పాను. రవితేజ నుంచి ఒక వేరియేషన్ ను అడిగితే నాలుగు వేరియేషన్లు చేసి చూపిస్తాడు. ఆయన విషయంలో నీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు .. దూసుకెళ్లిపో" అని రాజమౌళి అన్నారు. రవితేజతో సినిమా చేసిన తరువాత నాకు ఆ విషయం అర్థమైంది. ఈ సినిమాలో చేసిన ఐదుగురు హీరోయిన్స్ కి ఆల్ ది బెస్ట్" అని చెప్పాడు. 

More Telugu News