తిరుమలలో ఒక్కసారిగా మారిన వాతావరణం... భారీ వర్షం

  • ఏపీలో పలు చోట్ల ఆకస్మిక వర్షాలు
  • తిరుమలను కమ్మేసిన కారుమబ్బులు
  • ఉరుములు మెరుపులతో వర్షం
Rain lashes Tirumala hills

ఏపీలో ఈ సాయంత్రం పలుచోట్ల ఆకస్మిక వర్షాలు కురిశాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం నుంచి అధిక ఉష్ణోగ్రత నెలకొన్న తిరుమల కొండలను సాయంత్రానికి మేఘాలు కమ్మేశాయి. భారీ వర్షంతో తిరుమల తడిసి ముద్దయింది. 

శ్రీవారి ఆలయం ఎదుట, తిరు మాడవీధుల్లో నీరు ప్రవవహించింది. దర్శనం ముగించుకుని అప్పుడే బయటికి వచ్చిన భక్తులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో ఇబ్బంది పడ్డారు. పలు షాపింగ్ సముదాయాల్లోకి నీరు ప్రవేశించింది.

More Telugu News