BRS: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ

BRS will contest in Maharashtra local body elections
  • తెలంగాణ భవన్ లో కార్యక్రమం
  • బీఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర రైతు సంఘం నేత 
  • రైతుల నాయకత్వంలో ముందుకు పోదామన్న కేసీఆర్
  • విదర్భలో భారీ బహిరంగ సభ పెడదామని శ్రేణులతో వెల్లడి
ఇవాళ సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర రైతు సంఘం నేత శరద్ జోషి ప్రణీత్, ఆయన మద్దతుదారులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలిపారు. మెజారిటీ స్థానాలు దక్కేలా ప్రయత్నించాలని పార్టీ శ్రేణులకు నిర్దేశించారు. 

రైతుల నాయకత్వంలో ముందుకు పోదామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కమిటీలు వేస్తామని, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్ సూచించారు. విదర్భలో భారీ బహిరంగ సభ పెడదామని అన్నారు.
BRS
Maharashtra
Local Body Polls
KCR
Telangana

More Telugu News