'హలో మీరా' రిలీజ్ డేట్ ఖారారు!

  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'హలో మీరా'
  • సింగిల్ క్యారెక్టర్ తో నడిచే కథ ఇది 
  • దర్శకుడిగా కాకర్ల శ్రీనివాస్ పరిచయం
  • ఏప్రిల్ 21వ తేదీన సినిమా విడుదల

Hello Meera movie release date confirmed


ఒక సినిమా అంటే ఎన్నో రకాలు పాత్రలు ఉంటాయి. అలా ఉంటేనే సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని, రెండున్నర గంటలు ఎంటర్టైన్ చేయొచ్చని అంతా అనుకుంటారు. కానీ పరిమితమైన పాత్రలతోను అద్భుతాలు చేయొచ్చని ఇదివరకు ఎన్నోసార్లు నిరూపించబడింది. అయితే ఇప్పుడు తెలుగులో మరో ప్రయత్నంగా 'హలో మీరా' అనే సినిమా రాబోతోంది. టైటిల్ రోల్ ను 'గార్గేయి యల్లాప్రగడ' పోషించింది. ఒకే ఒక పాత్రతో ఈ సినిమాను రూపొందించడం, ఒక ప్రయోగమనీ .. సాహసమని చెప్పాలి.

విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమాకి కాకర్ల శ్రీనివాసు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకులు బాపు గారితో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవాన్ని రంగరించి, ఈ 'హలో మీరా' సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో.. డా.లక్ష్మణరావు  దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల ఈ సినిమాను నిర్మించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు అన్నీ కూడా సోషల్ మీడియాలో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. 'హలో మీరా' మీద మంచి బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సింగిల్ క్యారెక్టర్‌తో సినిమాను నడిపించడం, ఎక్కడా ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకుండా చిత్రీకరించడంపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను ఏప్రిల్ 21న విడుదల చేయనున్నారు.

More Telugu News