Congress: 3,232 రోజులుగా దేశాన్ని ఫూల్ చేస్తున్నారు.. మోదీపై కాంగ్రెస్ ఫైర్

have been fooling the country for 3232 days tweets Congress
  • ‘ఏప్రిల్ ఫూల్స్ డే’ సందర్భంగా కాంగ్రెస్ ట్వీట్
  • ప్రధానిగా మోదీ పదవీకాలాన్ని గుర్తు చేస్తూ విమర్శ
  • ‘ఇది జోక్ కాదు’ అంటూ క్యాప్షన్
రాజకీయ పార్టీలు ‘ఏప్రిల్ ఫూల్స్ డే’ని బాగా ఉపయోగించుకుంటున్నాయి. ఫూల్స్ డేతో ముడిపెట్టి తమ ప్రత్యర్థి పార్టీలను విమర్శిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కాంగ్రెస్ ఓ ట్వీట్ చేసింది. నరేంద్ర మోదీని పోలిన ఒక పిక్చర్ పెట్టి.. ‘3,232 రోజులుగా దేశాన్ని ఫూల్ చేస్తున్నారు’ అని పేర్కొంది. ప్రధానిగా మోదీ పదవీకాలాన్ని గుర్తు చేసేలా.. ‘2014 మే 26 - 2023 ఏప్రిల్ 1’ని ప్రస్తావిస్తూ ఏప్రిల్ ఫూల్స్ డే అని విష్ చేసింది. ఈ ఫొటోకు.. ‘ఇది జోక్ కాదు’ అని క్యాప్షన్ ఇచ్చింది.
Congress
Narendra Modi
april fools day
fooling country
Prime Minister

More Telugu News